News March 25, 2025
సూర్యాపేట: CM రేవంత్ రాక.. సభా ఏర్పాట్ల పరిశీలన

CM రేవంత్ ఈ నెల 30 ఉగాదిన సూర్యాపేట జిల్లా HNRకు రానున్నారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇచ్చే పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News September 17, 2025
16 ఏళ్ల నాటి పోరాటం గుర్తుచేసుకున్న MLC కవిత

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో, 2009లో వ్యవసాయ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన తెలంగాణ విలీన దినోత్సవం వేడుకల జ్ఞాపకాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ‘X’ ఖాతాలో పంచుకున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉన్న రోజులవి. ఆనాటి పోరాట స్ఫూర్తిని, యువతలో ఉన్న ఉత్సాహాన్ని మరోసారి ఆమె గుర్తుచేశారు.
News September 17, 2025
మరో 3 గంటలు భారీ వర్షం.. జాగ్రత్త!

TG: హైదరాబాద్లో <<17744168>>వర్షం<<>> దంచికొడుతోంది. మరో 3 గంటలు వాన కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అటు రాబోయే 2-3 గంటల్లో ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, యాదాద్రి, NZB, సూర్యాపేట, HNK, మేడ్చల్, ఉమ్మడి మెదక్ తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
News September 17, 2025
పోడు భూములకు రుణాలివ్వండి: కామారెడ్డి కలెక్టర్

అర్హులైన రైతులకు, పోడు భూములకు పంట రుణాలు వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన ఎంఎస్ఎంఈ యూనిట్లకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. అనంతరం ‘స్వచ్ఛత హీ సేవ’ పోస్టర్ను ఆవిష్కరించారు.