News March 25, 2025
పెరవలి : చికెన్ కోసం వెళ్లి ఇద్దరు మృతి

అన్నవరప్పాడు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టి , పిట్టల వేమవరం గ్రామానికి చెందిన మాకా సురేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హనుమంతు కూడా కన్నుమూశాడు. అయితే వారు ఇరువురూ చికెన్ కోసం అన్నవరప్పాడుకు వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు. ఘటనపై ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
Similar News
News March 28, 2025
అనపర్తి: కాలువలో పడి 4ఏళ్ల చిన్నారి మృతి

అనపర్తి మండలం కొప్పవరంలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. 4ఏళ్ల చిన్నారి అనూష భార్గవి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయింది. చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయిందని తండ్రి దొరబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇంటి పక్కనే పంట కాలువ ఉండడంతో ఆ కోణంలో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం పాప మృతదేహం లభించింది.
News March 28, 2025
కొవ్వూరు: ప్రభాకర్ మర్డర్ కేసులో వీడని మిస్టరీ..

కొవ్వూరు మండలం దొమ్మేరులో గురువారం జరిగిన పి.ప్రభాకర్ మర్డర్ కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయుర్వేదం షాప్ నడుపుతున్న ఆయనకు బుధవారం రాత్రి ఫోన్ కాల్ రావడంతో బయటికి వెళ్లి పొలంలో విగతజీవిగా మారాడు. దుండగులు అతడిపై కత్తితో దాడి చేసి కుడి చేతిని నరికి హస్తాన్ని తీసుకుపోయారు. సీసీ ఫుటేజ్, చివరి ఫోన్ కాల్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏఎస్పీ సుబ్బరాజు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది.
News March 28, 2025
RJY: జిల్లాలోని అభివృద్ధి ప్రతిపాదనలకు సీఎం ఆమోదం

జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశంలో తూ. గో జిల్లా తరఫున నివేదించిన పలు ప్రతిపాదనలకు ఆమోదించినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మౌలిక సదుపాయాలు, సేవా రంగం, పర్యాటక అనుబంధ రంగాలు, హైవేల అభివృద్ధి, నర్సరీ రైతులకి ఉపాధిహామీ పని దినాలు కల్పన, తదితర అంశాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.