News March 25, 2025

మీర్‌పేట్ మర్డర్ కేసులో కీలక పురోగతి

image

TG: మీర్‌పేట్ మాధవి మర్డర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇంట్లో లభించిన టిష్యూస్‌తో మాధవి DNA మ్యాచ్ అయినట్లు పోలీసులకు రిపోర్ట్ అందింది. టిష్యూస్‌ను DNA టెస్టుకు పంపగా మాధవి పిల్లల DNAతో అవి సరిపోలినట్లు తేలింది. కాగా రిటైర్డ్ జవాన్ గురుమూర్తి అనుమానంతో భార్య మాధవిని హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడకబెట్టాడు. ఎముకలు పొడి చేసి చెరువులో పడేశాడు.

Similar News

News March 31, 2025

వేసవిలో ఇలా చేయండి..

image

వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. వివిధ కారణాలతో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 8 గ్లాసుల వాటర్ తాగడం, దోసకాయ, పుచ్చకాయ తినడం, జ్యూస్‌లు తాగడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. దాహం వేయకున్నా తరచుగా నీరు తాగాలని చెబుతున్నారు. చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన డ్రింక్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.

News March 31, 2025

నిర్మాత ముళ్లపూడి కన్నుమూత

image

టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయన దివంగత ఈవీవీ సత్యనారాయణకు దగ్గరి బంధువు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలను ముళ్లపూడి నిర్మించారు.

News March 31, 2025

గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు

image

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్నారు. ఇటీవల గుండె సమస్యతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిన నానిని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. రక్తనాళాల్లో బ్లాక్‌లకు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలిస్తున్నారు. నాని కుటుంబసభ్యులు ప్రత్యేక విమానంలో అక్కడికి బయల్దేరారు.

error: Content is protected !!