News March 25, 2025

రాజమండ్రిలో జంట హత్యలు.. అసలేం జరిగిందంటే.!

image

రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. DSP శ్రీవిద్య ఈ కేసులో కీలక విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన శివకుమార్, సుమియా లవర్స్. తండ్రి మృతిచెందగా ఆమె తల్లి సాల్మాతో రాజమండ్రిలో ఉంటోంది. సుమియా వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శివ గొడవపడ్డాడు. ఆదివారం సుమియా మేడపైకి వెళ్లగా.. పడుకొని ఉన్న తల్లిని కత్తితో చంపేసి, తలుపు వెనుక ఉండి కూతురినీ చంపేశాడు. నిందితుడు అరెస్టయ్యాడు

Similar News

News September 16, 2025

HYD: ఫిలిం మేకింగ్‌పై పట్టుందా..? గెలిస్తే రూ.3 లక్షలు!

image

HYDలో ప్రొడ్యూసర్ దిల్ రాజు బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ పేరిట TFDC పోస్టర్ విడుదల చేశారు. సెప్టెంబర్ 30 వరకు 5 నిమిషాల షార్ట్ ఫిలిం, సాంగ్ వీడియో తీసి youngfilmmakerschallenge@gmail.com, 81258 34009 వాట్సప్‌కు పంపాలని చెప్పారు. మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, రెండవ బహుమతి రూ.2 లక్షలు, మూడో బహుమతి రూ.లక్ష ఇస్తారు.

News September 16, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్ సన్నాహక సమావేశం

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ గత 22 నెలల పాలన ప్రజా వ్యతిరేకమని విమర్శించారు. రేవంత్ రెడ్డి భయంతో HYD ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు. నగరాభివృద్ధి కొనసాగాలంటే BRS మళ్లీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఉపఎన్నికలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి జూబ్లీహిల్స్ నుంచి విజయయాత్రను ప్రారంభించాలని సూచించారు.

News September 16, 2025

జగిత్యాల: ‘కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరం’

image

కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్య నేరమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన సదస్సు నిర్వహించారు. జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు సలహాలు, సూచనలు ఇస్తూ వారిని ప్రోత్సహించాలన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే విద్యార్థులకు శిక్షలు తప్పవని హెచ్చరించారు.