News March 25, 2025
దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

విదేశీ పెట్టుబడుల వెల్లువ, అమెరికా మార్కెట్ల ర్యాలీ దృష్ట్యా భారత మదుపర్ల సానుకూల సెంటిమెంట్‌తో సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్తున్నాయి. 30 షేర్ BSE బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 418.54 పాయింట్లు లాభపడి 78,402.92కు చేరుకుంది. ఇక NSE నిఫ్టీ 107.85 పాయింట్లు పెరిగి 23,766.20 వద్ద ఉంది. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, HCL టెక్, TCS, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ మహీంద్రా, మారుతి బాగా లాభపడ్డాయి.
Similar News
News March 29, 2025
దేశ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వసంతకాలంలో జరుపుకునే ఈ నూతన సంవత్సర పండుగ దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలంతా సామరస్యం, సమగ్రతను చాటి దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి కోరారు. ఉగాదిని వివిధ పేర్లతో దేశంలోని పలు రాష్ట్రాలు జరుపుకుంటాయి.
News March 29, 2025
భూకంపం.. 1644 మంది మృతి

మయన్మార్ భూకంప మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1644 మంది మరణించారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. వేలాది మందికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. కాగా మృతుల్లో భారతీయులు ఎవరూ లేరని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
News March 29, 2025
రేపు, ఎల్లుండి పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

TG: రేపు, ఎల్లుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్టేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెలవులను రద్దు చేసింది.