News March 25, 2025

జీవీఎంసీలో ఏ కార్పొరేటర్‌పైనా ఒత్తిడి తేలేదు: MLC పిడుగు

image

జీవీఎంసీ మేయర్ పీఠం కోసం ఏకార్పొరేటర్ పైనా ఒత్తిడి చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని జనసేన MLC పిడుగు హరిప్రసాద్ అన్నారు. సోమవారం గాజువాకలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని కార్పొరేటర్లు గ్రహించారని దీంతో వారంతా మద్దతు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అధికార బలంతో గతంలో జీవీఎంసీలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన.. వాటిని వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News January 22, 2026

ఈ నెల 29న విడుదల కానున్న ఏపీ మత్స్యకారులు

image

బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులను ఈ నెల 29న విడుదల చేసి భారత్‌కు పంపనున్నట్లు Bangladesh Coast Guard ప్రకటించిందని ఈస్ట్ కోస్ట్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది ఉన్నారు. అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు.

News January 22, 2026

ఏయూలో పాలన గాడి తప్పిందా?

image

ఖరగ్‌పూర్‌ ఐఐటీలో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌‌ను ఏయూకి వీసీగా ప్రభుత్వం నియమించింది. అయితే వీసీ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులను కలుపుకొని ముందుకు వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఈడీ విద్యార్థి మృతి, వీసీని నేరుగా కలవొద్దంటూ సర్క్యులర్లు, తాజాగా ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు మెస్‌లో భోజనం నిలిపివేయడంతో వైఫల్యాలు కనిపిస్తున్నాయి.

News January 22, 2026

విశాఖ: జీవీఎంసీ సమావేశంలో కుప్పకూలిన ఇంజినీర్ మృతి

image

గాజువాక జీవీఎంసీ హాల్లో సమీక్ష జరుగుతుండగా కుప్పకూలిపోయిన సూపరింటెండెంట్ ఇంజినీర్ గోవిందరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం అధికారులు, ప్రజాప్రతినిధులు, జోనల్ కమిషనర్ సమక్షంలో సమావేశం జరుగుతుండగా గోవిందరాజు లేచి మాట్లాడే ప్రయత్నంలో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందు మృతి చెందారు.