News March 25, 2025

MBNR: BJP స్టేట్ చీఫ్ రేసులో DK.అరుణ

image

తెలంగాణ BJPకి ఉగాదిలోపు కొత్త చీఫ్ వస్తారనే సమాచారం. దీనిపై పార్టీ అధిష్ఠానం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కాగా ఓసీ కేటగిరీలో MBNR ఎంపీ డీకే అరుణ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు MP రఘునందన్‌రావు, మాజీ MLC రామచందర్‌రావు, ఎంపీలు ఈటల, ధర్మపురి అర్వింద్ పేర్లు కూడా రేసులో ఉన్నాయి. పాలమూరుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో అరుణమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆమెకే ఇవ్వాలని స్థానిక BJP శ్రేణులు అంటున్నాయి.

Similar News

News July 6, 2025

రేపు ములుగు జిల్లాలో మంత్రుల పర్యటన

image

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో నకిలీ విత్తనాలతో పంటకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెక్కులను అందజేయనున్నారు. అనంతరం సీతక్క మంగపేట, ఏటూరునాగారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

News July 6, 2025

రాజమండ్రి : ప్రయాణికులకు గమనిక

image

ఆషాఢ మాసం సందర్భంగా రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లే ఇంద్ర ఏ.సీ బస్సు ధరలో 15% రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ డీఎం కె.మాధవ తెలిపారు. నేడు ఆయన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. రాజమండ్రి – హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ తక్కువ ధరకు ఇంద్ర ఏ.సీ బస్సులో ప్రయాణించ వచ్చుని అన్నారు.ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుత టిక్కెటు ధర రూ.1060లు కాగా రాయితీపై ధర రూ.920గా ఉందని చెప్పారు.

News July 6, 2025

JNTUలో కౌన్సెలింగ్.. విద్యార్థులకు కీలక సూచన

image

TG EAPCET 2025లో భాగంగా ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించి అధికారులు మరో కీలక సూచన చేశారు. కౌన్సెలింగ్ పూర్తయిన విద్యార్థులు సాయంత్రం 4 గంటల నుంచి వెబ్ ఆప్షన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ మంగళవారం సాయంత్రం వరకు కొనసాగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు.