News March 25, 2025
కరీంనగర్‌కు రెండు కొత్త కాలేజీలు

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజినీరింగ్, లా కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల కావాలని ఎప్పటినుంచో ఇంజినీరింగ్ విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. తాజాగా రెండు కళాశాలలు మంజూరు కావడంతో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.
Similar News
News March 31, 2025
మార్కాపురంలో క్షుద్ర పూజల కలకలం

మార్కాపురం దసరా మండపం సమీపంలో క్షుద్ర పూజలు ఆదివారం కలకలం రేపాయి. ఉగాది పండుగ రోజు అటుగా వెళ్లిన స్థానికులు పసుపు కుంకుమ, నిమ్మకాయలు కొబ్బెర చిప్పలు వేసి పూజలు చేసినట్లుగా గుర్తించారు. శనివారం అమావాస్య కావడంతో క్షుద్ర పూజలు జరిగాయని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూజలు జరిగిన ప్రాంతంలో పంప్ హౌస్‌లో పని చేసేవారు ఈ విషయం తెలిసి ఆందోళన చెందారు. పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.
News March 31, 2025
అన్నమయ్య: ఉగాది వేడుకల్లో పాల్గొన్న SP దంపతులు

అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం శ్రీ విశ్వావసునామ ఉగాది పండుగను జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నిర్వహించింది. సంప్రదాయ దుస్తుల్లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. పోలీసు అధికారులకు సిబ్బందికి ఉగాది పచ్చడి, ప్రసాదం, భోజనాలను ఎస్పీ దంపతులు పంపిణీ చేశారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో గ్రూప్ ఫొటో దిగి జిల్లా పోలీసులు అందరిలో ఉత్సాహాన్ని నింపారు.
News March 31, 2025
కాళ్ల: కోడి పందేలు ఆడుతున్న ముగ్గురు అరెస్ట్

కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఆదివారం తెలిపారు. ఎస్ఐ ఎన్.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం కాళ్ల గ్రామంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద రూ.6,100 నగదు, కోడిపుంజు, కోడి కత్తి స్వాధీనం చేసుకున్నామన్నారు.