News March 25, 2025
కరీంనగర్‌కు రెండు కొత్త కాలేజీలు

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజినీరింగ్, లా కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల కావాలని ఎప్పటినుంచో విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. తాజాగా రెండు కళాశాలలు మంజూరు కావడంతో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.
Similar News
News March 31, 2025
వికారాబాద్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్

రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం సందర్భంగా వికారాబాద్ పట్టణం పరిధిలోని ఆలంపల్లి ఆలం షాహి దర్గా వద్ద ముస్లిం సోదరులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, నరేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
News March 31, 2025
మత సామరస్యానికి ప్రతీక రంజాన్: పరిగి ఎమ్మెల్యే

రంజాన్ పండుగను పురస్కరించుకుని పరిగి పట్టణ కేంద్రంలోని ఈద్గా వద్ద కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.
News March 31, 2025
10 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

గత 10 నెలల్లో ఏపీకి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖ బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన హోటల్, ఆఫీస్ టవర్‌కు తల్లి భువనేశ్వరితో కలిసి భూమిపూజ చేశారు. గత పాలకులు విధ్వంసక విధానాలతో వ్యాపార వాతావరణానికి నష్టం కలిగించారని లోకేశ్ విమర్శించారు. తాము విశాఖను ఐటీ హబ్‌గా మార్చి రాబోయే ఐదేళ్లలో యువతకు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.