News March 25, 2025
ట్రంప్‌కు గిఫ్ట్ పంపించిన పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్, US అధ్యక్షుడు ట్రంప్ మధ్య స్నేహం మరింత పెరుగుతోంది. ఈ నెల మొదట్లో ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కోఫ్‌కు భేటీ అనంతరం ట్రంప్ చిత్రపటాన్ని పుతిన్ ఆయనకు ఇచ్చారని మాస్కో ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. ఆ బహుమతి పట్ల ట్రంప్ చాలా సంతోషించారని విట్కోఫ్ తాజాగా వెల్లడించారు. ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా ఉండే అమెరికా, రష్యా బంధం ట్రంప్ వచ్చాక మెరుగుపడుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 19, 2026
హర్షిత్ రాణాను చూసి NZ ప్లేయర్స్ వణికారు: క్రిస్ శ్రీకాంత్

NZతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓడిపోయినప్పటికీ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా (52) తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. గతంలో ఆయన ఎంపికను విమర్శించిన మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ ఇప్పుడు హర్షిత్ ఆటతీరుకు ఫిదా అయ్యారు. ‘హర్షిత్ బ్యాటింగ్ చూస్తుంటే కివీస్ బౌలర్లు వణికిపోయారు. అతడు రియల్ గేమ్ ఛేంజర్’ అని ప్రశంసించారు. కోహ్లీ సెంచరీ వృథా అయినా.. హర్షిత్ పోరాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
News January 19, 2026
నితిన్ నబీన్ ఎంపిక వెనుక వ్యూహం ఇదేనా?

BJP జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నితిన్ నబీన్ ఎంపిక వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో యువ నాయకత్వానికి సంకేతం ఇవ్వడంతో పాటు యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివాద రహితుడిగా, PM మోదీ, అమిత్ షాకు నమ్మకమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. నబీన్ అధ్యక్షతన 2029 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధం కానుంది.
News January 19, 2026
అగాథం నుంచి అగ్రస్థానానికి తెచ్చాం: CM

తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం అగాథంలో కూరుకుపోయిందని దావోస్ పర్యటనలో AP CM CBN అన్నారు. ‘రాష్ట్ర పరిస్థితిని చూసిన వారంతా దాన్ని బాగు చేయగలుగుతారా? అని సందేహించారు. అసాధ్యమనీ అన్నారు. దిగిన తర్వాత ఎంత అగాథంలోకి వెళ్లిందో అర్థమైంది. అలాంటి రాష్ట్రాన్ని18 నెలల్లో నంబర్ 1 బ్రాండ్‌గా తయారుచేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్‌లో వెళ్లాం. 25 కొత్త పాలసీలు తెచ్చాం’ అని తెలిపారు.


