News March 25, 2025

ప్రకాశం: యువతకు గమనిక

image

ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్ని వీర్ టెక్నికల్, అగ్ని వీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్ని ట్రేడ్స్ మెన్ విభాగాల్లో ఉద్యోగ నియామకాలకు యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఒంగోలు స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ సూచించారు. ఏప్రిల్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తెలుగులోనే ఎగ్జాం నిర్వహిస్తారన్నారు. ఎన్‌సీసీ వారికి బోనస్ మార్కులు ఉంటాయన్నారు.

Similar News

News March 30, 2025

ప్రకాశం: వైసీపీ ఉద్యోగ పెన్షనర్ విభాగ అధ్యక్షులు వీరే..!

image

ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల ఉద్యోగ పెన్షనర్ల విభాగ అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా అధ్యక్షుల వివరాలను కిందిలా ఉన్నాయి.
>గిద్దలూరు- బంగారు విశ్వరూపం
>కనిగిరి – ఏకుల వెంకట సుబ్బారెడ్డి
>దర్శి – రావులపల్లి గురుప్రసాద్
>కొండేపి- పి కృష్ణమూర్తి
>మార్కాపురం – టీ రంగారెడ్డి
>ఒంగోలు – పెట్లూరి ప్రసాద్‌‌లు నియమితులయ్యారు.

News March 30, 2025

ప్రకాశం: వైసీపీ ఉద్యోగ పెన్షనర్ విభాగ అధ్యక్షులు వీరే..!

image

ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల ఉద్యోగ పెన్షనర్ల విభాగ అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా అధ్యక్షుల వివరాలను కిందిలా ఉన్నాయి.
>గిద్దలూరు- బంగారు విశ్వరూపం
>కనిగిరి – ఏకుల వెంకట సుబ్బారెడ్డి
>దర్శి – రావులపల్లి గురుప్రసాద్
>కొండేపి- పి కృష్ణమూర్తి
>మార్కాపురం – టీ రంగారెడ్డి
>ఒంగోలు – పెట్లూరి ప్రసాద్‌‌లు నియమితులయ్యారు.

News March 30, 2025

ఒంగోలు: ఈనెల 31న పోలీస్ గ్రీవెన్స్ రద్దు

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. ఈనెల 31వ తేదీన రంజాన్ (ప్రభుత్వ సెలవు దినం) పండుగ అయినందున మీకోసం కార్యక్రమం రద్దు అయినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఎస్పీ కార్యాలయానికి రావద్దని సూచించారు.

error: Content is protected !!