News March 25, 2025

ADB: వివేక్‌కి శుభాకాంక్షలు తెలిపిన పాయల్ శంకర్

image

చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ జరిగింది. వివేక్‌కు మంత్రి పదవి వచ్చేసిందంటూ పాయల్ శంకర్ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వివేక్ కుటుంబం హడావుడి కొనసాగుతోందంటూ BRS MLA మల్లారెడ్డి ఆటపట్టించగా.. మల్లారెడ్డి జోష్ కొనసాగుతోందని వివేక్ అన్నారు.

Similar News

News October 27, 2025

అశ్వ వాహనంపై కోరమీసాల కురుమూర్తి రాయుడి విహారం

image

కురుమూర్తి రాయుడి బ్రహ్మోత్సవాల్లో రెండో ప్రధాన ఘట్టమైన అలంకార ఉత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారు అశ్వ వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. కోరమీసాలు, కలపాగా, దూసిన కరావంతో క్షత్రియ లక్షణాలు కలిగి విశేష ఆభరణాలతో అలంకరించిన కురుమూర్తి రాయుడు మెట్ల మార్గం గుండా రాజసంగా విచ్చేశారు.

News October 27, 2025

బంగారు ఆభరణాలతో కురుమూర్తి రాయుడు దివ్య శోభ

image

అమ్మాపురంలోని కాంచనగుహలో కొలువైన కురుమూర్తి స్వామికి ముక్కెర వంశీయులు కీరీటం, హస్తాలు, పాదుకలు, కోరమీసాలు సహా పలు స్వర్ణాభరణాలను సమర్పించారు. అనంతరం బంగారు ఆడరశాలలో ఆభరణాలను ఆవిష్కరించి అలంకరించారు. స్వర్ణాభరణాలంకరణతో అలంకార భూషితుడైన కురుమూర్తి రాయుడు దివ్యశోభతో వెలుగొందగా, కాంచనగుహ దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది. పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News October 27, 2025

HYD: కలెక్టర్ల సమక్షంలో నేడు లక్కీ డ్రా

image

HYD, MDCL, RR, VKB జిల్లాల కలెక్టర్ల సమక్షంలో నేడు ఉ.11 గంటలకు మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. శంషాబాద్, సరూర్‌నగర్ డివిజన్లలోని మద్యం దుకాణాలకు శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ సెంటర్‌లో లక్కీ డ్రా నిర్వహించనుండగా.. సరూర్‌నగర్‌లో 7,845, శంషాబాద్‌లో 8,536, మేడ్చల్‌లో 5,791, వికారాబాద్‌లో 1,808, సికింద్రాబాద్‌లో 3,022, హైదరాబాద్‌లో 3,201, మల్కాజిగిరిలో 6,063 దరఖాస్తులు వచ్చాయి.