News March 25, 2025

బెట్టింగ్‌ భూతానికి అనకాపల్లి జిల్లా యువకుడు బలి

image

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం ప్రకారం.. గుండ్ల పోచంపల్లిలో నివాసముంటున్న సోమేశ్(29) బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమేశ్ అనకాపల్లి జిల్లావాసిగా పోలీసులు గుర్తించారు. అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 16, 2025

NTR: నేడు వైసీపీలోకి రంగా వారసురాలు.?

image

దివంగత నేత వంగవీటి రంగా కుమార్తె ఆశ కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. నేటి ఉదయం బందర్ రోడ్డులోని రంగా విగ్రహానికి నివాళులర్పించి కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు రంగా కుమార్తె ఆశ కిరణ్ అన్నది కూడా చాలా మందికి తెలియదు. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమె వంగవీటి రాధా ఉన్న పార్టీలో కాకుండా మరో పార్టీలో చేరే అవకాశం ఉందని, YCPలో చేరే ఛాన్స్ ఉందని చర్చ నడుస్తోంది.

News November 16, 2025

శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్

image

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో అమీబిక్ మెనింజోఎన్‌సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీస్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ 04735 203232.

News November 16, 2025

బాపట్ల: ‘స్కాన్ సెంటర్లకు రెన్యువల్ తప్పనిసరి’

image

స్కాన్ సెంటర్ నిర్వాహకులు రెన్యువల్ తప్పనిసరిగా చేయించుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అథారిటీ సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లేని స్కాన్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, మెడికల్ వేస్ట్, బయో మెడికల్‌పై అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్వో పాల్గొన్నారు.