News March 25, 2025
జస్టిస్ వర్మ నగదు ఘటన: ఎంపీలతో ధన్‌ఖడ్ కీలక సమావేశం

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సాయంత్రం 4:30కు ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు కాలిపోవడం, ఆయనపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపక్ష ఎంపీల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అలాగే NJACని అమల్లోకి తీసుకురావడంపై చర్చిస్తారని సమాచారం. నిన్న BJP, కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేతో ధన్‌ఖడ్ ప్రత్యేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.
Similar News
News March 31, 2025
రంజాన్ స్పెషల్.. పసందైన విందు

రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది ముస్లిం సోదరులు ఇచ్చే విందు. మతాలకు అతీతంగా స్నేహితులు, సన్నిహితులను తమ ఇళ్లకు పిలిచి పసందైన చికెన్ బిర్యానీ వడ్డిస్తారు. ఆ తర్వాత తియ్యటి షేమియా తినిపిస్తారు. అనంతరం ఆత్మీయంగా హత్తుకుని పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరి మీకూ ముస్లిం స్నేహితులు ఉన్నారా? ఈద్ సందర్భంగా మిమ్మల్ని విందుకు ఆహ్వానించారా? కామెంట్ చేయండి.
News March 31, 2025
ముస్లింలకు PM మోదీ ఈద్-ఉల్-ఫితర్ విషెస్

దేశంలోని ముస్లింలకు PM నరేంద్ర మోదీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరిలో శాంతి, దయాగుణం పెంపొందాలన్నారు. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు దేశంలోని అన్ని పాంతాల్లో ముస్లింలు ఈద్గాలకు చేరుకొని పవిత్ర రంజాన్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆలింగనం చేసుకొని ఒకరికొకరు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
News March 31, 2025
వివాహితపై సామూహిక అత్యాచారం

TG: నాగర్ కర్నూల్ (D) ఊర్కొండ(M)లో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. MBNR జిల్లాకు చెందిన ఆమె బంధువుతో కలిసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాలకృత్యాల కోసం గుట్ట ప్రాంతానికి వెళ్లగా, 8 మంది ఆ బంధువుపై దాడి చేసి అతని చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ తర్వాత వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనకు పాల్పడ్డ వారిని గుర్తించిన పోలీసులు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.