News March 25, 2025
MBNR: పసి బిడ్డలకు ఏం తెలుసు అమ్మానాన్న మళ్లీ రారని..!

ఊహ తెలియని వయసులోనే వారి తల్లిదండ్రులు చనిపోయారు.. అనాథలుగా మారిన ఆ పిల్లలకు ఏం తెలుసు అమ్మానాన్న మళ్లీ రారని..ఆకలైనప్పుడు అమ్మా అని ఎన్నిసార్లు పిలిచినా అమ్మ రావట్లేదని ఆ పిల్లలు అంటున్న మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. గద్వాల(D),మల్దకల్(M), చర్లగార్లపాడులోని ముగ్గురు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. నేడు అయిజ(M) యాపదిన్నె వాసులు రాకేశ్, రామాంజనేయులు వారికి రూ.10,500ఆర్థిక సాయం చేశారు.
Similar News
News April 1, 2025
ATP: పింఛన్ పంపిణీలో పాల్గొనున్న కలెక్టర్

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం పర్యటించనున్నారు. తాళ్లకేర గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు టీడీపీ కార్యాలయం సోమవారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పింఛన్ పంపిణీ చేయనున్నారు.
News April 1, 2025
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్: అనిత

యువగళం పాదయాత్రలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అనకాపల్లి-అచ్యుతాపురం నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని రాష్ట్ర హోం శాఖామంత్రి వంగలపూడి అనిత గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు మంత్రి రహదారి విస్తరణకు నిధులు మంజూరు చేయడమే కాకుండా సోమవారం శంకుస్థాపన చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
News April 1, 2025
రాజమండ్రి: తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

పాస్టర్ ప్రవీణ్ మరణంపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న రాజమహేంద్రవరం లలితా నగర్కు చెందిన దేవాబత్తుల నాగ మహేశ్ని త్రీ టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పూర్తిగా సమాచారం తెలియకుండా తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలను ప్రచారం చేసినా, మతపరమైన గొడవలకు ఆస్కారం కలిగే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అప్పారావు హెచ్చరించారు.