News March 25, 2025
ఏప్రిల్‌లో ‘మన ఇంటికి మన మిత్ర’

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కల్పించడానికి APRలో ‘ప్రతి ఇంటికి మనమిత్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి స్మార్ట్‌ఫోన్లలో 9552300009 నంబర్‌ను సేవ్ చేసి సేవల గురించి వివరిస్తారని IT&RTG శాఖ కార్యదర్శి భాస్కర్ వెల్లడించారు. ప్రస్తుతం 210 సేవలు అందుతున్నాయని చెప్పారు. అన్ని రకాల ధ్రువపత్రాలను వాట్సాప్‌లోనే అందిస్తామని తెలిపారు.
Similar News
News March 31, 2025
తెలంగాణ టు ఫిలిప్పీన్స్.. వయా కాకినాడ

ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్‌కు బియ్యాన్ని ఎగుమతి చేయనుంది. 8 లక్షల టన్నుల బియ్యం ఎక్స్‌పోర్ట్‌కు ఒప్పందం కుదరగా తొలి విడతగా ఇవాళ 12,500 టన్నుల MTU 1010 రకాన్ని పంపనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ కాకినాడ వెళ్లి బియ్యం నౌకను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన వెంటన ఫిలిప్పీన్స్ ప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఉన్నారు.
News March 31, 2025
చైనా వండర్.. సముద్ర గర్భంలో డేటా సెంటర్

టెక్నాలజీలో చైనా మరో అద్భుతం చేసింది. ప్రపంచంలో తొలిసారిగా సముద్రం లోపల AI డేటా సెంటర్ ఏర్పాటు చేసింది. హాంకాంగ్‌కు ఆగ్నేయ దిశలోని లింగ్ షుయి తీరంలో దీన్ని ప్రారంభించింది. ఇక్కడ 400 హైపెర్ఫార్మెన్స్ సర్వర్లను కూల్ చేసే సౌకర్యాలు ఉంటాయి. ఒక సెకన్‌లో పారిశ్రామిక రంగం నుంచి మెరైన్ రీసెర్చ్ వరకు 7వేల Ai ప్రశ్నలను ప్రాసెస్ చేస్తుంది. ఇది ఆరంభమేనని, మున్ముందు వీటి సంఖ్యను పెంచుతామని పేర్కొంది.
News March 31, 2025
1 కాదు, 2 కాదు.. 10 ప్రభుత్వ ఉద్యోగాలు

TG: ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టం అవుతున్న ఈ రోజుల్లో భూపాలపల్లి (D) గుంటూరుపల్లికి చెందిన V. గోపీకృష్ణ 10 ఉద్యోగాలు సాధించారు. తాజాగా, TGPSC రిలీజ్ చేసిన గ్రూప్-1 ఫలితాల్లో 70వ ర్యాంకర్‌గా నిలిచారు. ఈయన ఇప్పటి వరకు 7 కేంద్ర, 3 రాష్ట్ర ప్రభుత్వ కొలువులు సాధించారు. ప్రస్తుతం గోపి మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా ట్రైనింగ్ పొందుతున్నారు. త్వరలో గ్రూప్-1 పోస్టులో జాయిన్ అవుతానని చెప్పారు.