News March 25, 2025
35ఏళ్ల తర్వాత సంతానం కష్టమే!

కెరీర్ గ్రోత్ అంటూ చాలా మంది మగవాళ్లు 30ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవట్లేదు. మరికొందరేమో సెటిల్ అయ్యాకే పిల్లలంటూ ప్లాన్ చేస్తుంటారు. అయితే, 35ఏళ్లు దాటితే వీర్యంలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుందని, వాటి ఆకారం మారిపోయి కదలికలు తగ్గుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘పిల్లలు పుట్టడానికి ముఖ్యమైన టెస్టోస్టెరాన్ 35ఏళ్ల నుంచి తగ్గుతూ ఉంటుంది. దీనికి పరిష్కారంగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
Similar News
News March 31, 2025
వేసవిలో ఇలా చేయండి..

వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. వివిధ కారణాలతో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 8 గ్లాసుల వాటర్ తాగడం, దోసకాయ, పుచ్చకాయ తినడం, జ్యూస్‌లు తాగడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. దాహం వేయకున్నా తరచుగా నీరు తాగాలని చెబుతున్నారు. చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన డ్రింక్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.
News March 31, 2025
నిర్మాత ముళ్లపూడి కన్నుమూత

టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయన దివంగత ఈవీవీ సత్యనారాయణకు దగ్గరి బంధువు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలను ముళ్లపూడి నిర్మించారు.
News March 31, 2025
గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్నారు. ఇటీవల గుండె సమస్యతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిన నానిని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. రక్తనాళాల్లో బ్లాక్‌లకు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలిస్తున్నారు. నాని కుటుంబసభ్యులు ప్రత్యేక విమానంలో అక్కడికి బయల్దేరారు.