News March 25, 2025
MLC Elections: ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే..!

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (ఏప్రిల్ 23) 116 మంది (కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లు) తమ ఓటు హక్కును వినియోగించకోనున్నారు. ఎంఐఎంకు 49 ఓట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 13 ఉన్నాయి. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు 54 మంది ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 59 ఓట్ల కంటే ఎక్కువ వస్తే వారే విజయం సాధిస్తారు. ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉంటారు.
Similar News
News March 29, 2025
SCRలో 92 మంది పదవీ విరమణ

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న 92 మంది ఉద్యోగులు శుక్రవారం పదవీ విరమణ పొందారు. హెడ్ క్వార్టర్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లతో పాటు లాలాగూడ వర్క్‌షాపులో వీరు విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా సహోద్యోగుల ఆధ్వర్యంలో వివిధ రైల్వే కార్యాలయాల్లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
News March 29, 2025
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి: డీఎంహెచ్‌ఓ

30, అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను రాజీవ్ ఆరోగ్యశ్రీలో నమోదు చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌ఓ) డాక్టర్ వెంకట్ ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలను కోరారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సహకారంతో సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్నీ భవనంలో శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
News March 29, 2025
OU: రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏ లాంగ్వేజెస్ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బీఏ లాంగ్వేజెస్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. ఈ రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపరుకు రూ.500 చొప్పున చెల్లించి వచ్చే నెల 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.