News March 25, 2025

ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు అనుమతులు మంజూరు: ఎమ్మెల్యే 

image

గుడివాడ – పామర్రు ప్రధాన రహదారిలో నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని రైల్వే గేట్‌లపై నిర్మించేందుకు సాంకేతిక అనుమతులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. మంగళవారం జాతీయ రహదారుల అథారిటీ అధికారులతో ఎమ్మెల్యే తన స్వగృహంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై రివ్యూ నిర్వహించారు. రైల్వే గేట్లపై ఇప్పటివరకు అనుమతులు రాకపోవడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరగలేదన్నారు.

Similar News

News July 7, 2025

మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీవో స్వాతి, తదితరులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News July 7, 2025

నేడు ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు కలెక్టర్

image

ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో ఈనెల 10న వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. ఆయన పర్యటనను దృష్టిలో పెట్టుకొని భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ట్రస్టును సందర్శించనున్నారు.

News July 7, 2025

మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం, సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులకు అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వివినియోగం చేసుకోవాలని కోరారు.