News March 25, 2025

సీఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

image

హుజూర్ నగర్‌లో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక అధికారులు సభా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు పార్కింగ్ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు ఉన్నారు.

Similar News

News September 15, 2025

NRPT: ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి: ఎస్పీ

image

నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ ప్రోగ్రాంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో అందిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫిర్యాదులను పరిశీలించి, చట్ట ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు.

News September 15, 2025

NRPT: ప్రజావాణికి 44 ఫిర్యాదులు

image

NRPT కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 44 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆమె అర్జీలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అధికారులు ఏ ఒక్క ఫిర్యాదును పెండింగ్‌లో పెట్టకుండా, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

News September 15, 2025

సీఎంకు అనకాపల్లి కలెక్టర్ విజ్ఞప్తి

image

అనకాపల్లి జిల్లాలో పశుసంపద, పువ్వులు, కూరగాయల సాగుకు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పాల్గొని జిల్లా అభివృద్ధి నివేదికను అందజేశారు. ప్రతి ఇంటికి ఒకటికంటే ఎక్కువ పశువులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ జాతి పశువులను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు రాయితీ అందించాలన్నారు.