News March 25, 2025
WGL: మార్కెట్‌లో సరుకుల ధరలు ఇలా..

ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి క్వింటాకి నిన్న రూ.10,500 ధర పలకగా.. నేడు రూ.10,800 పలికింది. అలాగే టమాటా మిర్చికి నిన్న రూ.26,500 ధర రాగా..నేడు రూ.28వేలు వచ్చింది. సింగిల్ పట్టికి రూ.27వేలు (నిన్న 26వేలు), దీపిక మిర్చి రూ.13,300(నిన్న రూ.22,500) ధర ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మక్కలు బిల్టి క్వింటాకి నిన్న రూ.2265(నేడు రూ.2250) పలికిందన్నారు.
Similar News
News March 30, 2025
వరంగల్: నేడు, రేపు.. అవి తెరిచే ఉంటాయి!

వరంగల్ మహా నగర పాలక సంస్థ పన్నుల వన్ టైమ్ సెటిల్మెంట్ చెల్లింపు కోసం నేడు(ఆదివారం), రేపు(సోమవారం) మీ సేవా కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ కేంద్రాలు తెరిచే ఉండనున్నాయి. వన్ టైమ్ సెటిల్మెంట్ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రజల కోసం ఈ అవకాశాన్ని కల్పించినట్లు గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. పాత బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ మినహాయింపు పొందాలన్నారు.
News March 30, 2025
WGL: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. వరంగల్ జిల్లాలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ తెలుగు నూతన సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ ఏడాది నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘ కీ ‘ రోల్ కాబోతుంది.
News March 30, 2025
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేఖ

రాష్ట్ర ప్రజానీకం, ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉగాది పర్వదినం సందర్భంగా శనివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.