News March 25, 2025
Stock Markets: ఎగిసి ‘పడ్డ’ నిఫ్టీ, సెన్సెక్స్

ఉదయం భారీగా లాభపడ్డ బెంచ్‌మార్క్ సూచీలు చివరికి ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ 78,017 (32), నిఫ్టీ 23,668 (10) వద్ద స్థిరపడ్డాయి. సూచీలు రెసిస్టెన్సీ వద్దకు చేరడం, ట్రంప్ టారిఫ్స్ ప్రకటనే ఇందుకు కారణాలు. ఐటీ షేర్లు ఎగిశాయి. వినియోగం, PSU బ్యాంకు, మీడియా, రియాల్టి, మెటల్, ఎనర్జీ, చమురు, PSE, ఫార్మా, ఆటో, కమోడిటీస్ షేర్లు ఎరుపెక్కాయి. అల్ట్రాటెక్, ట్రెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, గ్రాసిమ్ టాప్ గెయినర్స్.
Similar News
News March 30, 2025
నెలవంక దర్శనం.. రేపే రంజాన్

మన దేశంలో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో రేపు రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్)జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రభుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. హైదరాబాద్ మక్కా మసీద్, మీరాలం ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రంజాన్ సందర్భంగా రేపు సెలవు ప్రకటించారు.
News March 30, 2025
విషాదం.. ఆరుగురి మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ గాలులు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు మరణించారు. కులు సమీపంలోని పర్యాటక ప్రాంతంలో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. వాటితో పాటు రాళ్లు, శిథిలాలు ఓ వ్యానుతో పాటు అక్కడ కూర్చున్న పర్యాటకులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
News March 30, 2025
కొత్త రేషన్ కార్డుల్లో 30 లక్షల మంది: సీఎస్

TG: కొత్తగా రేషన్ కార్డుల్లో 30లక్షల మందిని చేర్చనున్నామని సీఎస్ శాంతికుమారి చెప్పారు. హుజూర్ నగర్‌లో జరిగిన సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు జారీ కానున్నట్లు వెల్లడించారు.