News March 25, 2025

మరో చోటుకు తిహార్ జైలు తరలింపు

image

ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును ఢిల్లీ సరిహద్దుల్లోకి మార్చనున్నట్లు ఢిల్లీ CM రేఖా గుప్తా ప్రకటించారు. కొత్త జైలు నిర్మాణం కోసం సర్వే, కన్సల్టెన్సీ సర్వీసుల ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. 400 ఎకరాల విస్తీర్ణంలో తిహార్ జైలును 1958లో నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ 13వేల మంది ఖైదీలు ఉన్నట్లు అంచనా. తొలుత ఇది పంజాబ్ అధీనంలో ఉండగా 1966లో ఢిల్లీ ప్రభుత్వం టేకోవర్ చేసింది.

Similar News

News March 29, 2025

రాష్ట్రంలో 4,818 చలివేంద్రాలు

image

TG: ఎండలు ముదిరిన నేపథ్యంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 4,818 చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 458, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరిలో 8 చలివేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటి నిర్వహణ బాధ్యతలను పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. వాటర్ బాటిల్స్ కొనుక్కోకుండా, చలివేంద్రాల్లో ఉచితంగా నీటిని తాగాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 29, 2025

గురుకులాల్లో ప్రవేశాలు.. దరఖాస్తు గడువు పెంపు

image

AP: గురుకుల స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగిలిన ఖాళీల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 6లోగా https://aprs.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్షకు కూడా ఏప్రిల్ 6 వరకు అప్లై చేసుకోవచ్చని సూచించారు.

News March 29, 2025

ఏషియన్ ఛాంపియన్‌షిప్స్: భారత్‌కు గోల్డ్

image

జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతున్న ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో భారత్ తొలి గోల్డ్ మెడల్ సాధించింది. మహిళా రెజ్లర్ మనీషా భన్వాలా 62kgs విభాగంలో స్వర్ణ పతకం గెలిచారు. ఫైనల్‌లో ఉత్తర కొరియా ప్లేయర్ జె కిమ్‌పై 8-7 తేడాతో విజయం సాధించారు. మరో రెజ్లర్ అంతిమ్ పంఘల్ (53kgs) కాంస్యం గెలిచారు. దీంతో ఇప్పటివరకు భారత్ గెలిచిన మెడల్స్ సంఖ్య 7కు (1 గోల్డ్, 1 సిల్వర్, 5 బ్రాంజ్) చేరింది.

error: Content is protected !!