News March 25, 2025

ఆస్తి పన్ను వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ

image

AP: ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరు వరకు ప్రాపర్టీ ట్యాక్స్‌పై పెండింగ్‌లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ జీవో జారీ చేసింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల కొన్నేళ్లుగా పేరుకుపోయిన రూ.కోట్ల బకాయిలు వసూలవుతాయని అధికారులు చెబుతున్నారు.

Similar News

News March 29, 2025

ధోనీకి చెప్పే ధైర్యం కోచ్‌లకు లేదు: మనోజ్

image

CSK జట్టును గెలిపించేందుకు ధోనీని ముందే బ్యాటింగ్‌కు వెళ్లమని చెప్పే ధైర్యం కోచింగ్ సిబ్బందికి లేదని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ విమర్శించారు. 9వ స్థానంలో ధోనీ రావడం ఏంటని ప్రశ్నించారు. ‘ధోనీ 16 బంతుల్లో 30 రన్స్ చేసి అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నారు. ఇలాంటి బ్యాటర్ ముందే బ్యాటింగ్‌కు రావాల్సింది. ఈ విషయాన్ని కోచ్‌లు కూడా చెప్పలేరు. ఎందుకంటే ధోనీ ఒకసారి నిర్ణయించుకుంటే అంతే’ అని తెలిపారు.

News March 29, 2025

‘మ్యాడ్ స్క్వేర్’ తొలిరోజు భారీ కలెక్షన్లు

image

నార్నె నితిన్, సంగీత్, రామ్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టినట్లు టీటౌన్ వర్గాలు తెలిపాయి. మొదటిరోజు ఏకంగా రూ.17 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. బ్రేక్ ఈవెన్ విలువ రూ.45 కోట్లు కాగా తొలిరోజే 40శాతం రికవరీ చేసినట్లు వెల్లడించాయి. లాంగ్ వీకెండ్ కావడంతో భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

News March 29, 2025

అమెరికా సుంకాలు భారత్‌కు మంచిదే: నీతి ఆయోగ్

image

చైనా, మెక్సికో, కెనడా దేశాలపై వచ్చే నెల 2 నుంచి US విధించనున్న అదనపు సుంకాలు భారత్ మంచికేనని నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రవాకర్ సాహూ అభిప్రాయపడ్డారు. ‘ప్రాథమికంగా చూస్తే ట్రంప్ ప్రతీకార సుంకాలు భారత్‌ను మరీ ఇబ్బంది పెట్టవు. ఏవో కొన్ని రంగాలు స్వల్పంగా ప్రభావితమవుతాయి. కానీ దీని వల్ల అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయి’ అని వివరించారు. US దిగుమతుల్లో 50శాతం చైనా, మెక్సికో, కెనడా నుంచే ఉన్నాయి.

error: Content is protected !!