News March 25, 2025
BREAKING: దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు గల్లంతు

నల్గొండ జిల్లా దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నేటి ఉదయం ఆరుగురు యువకులు దండెంపల్లి SLBC కాలువలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 26, 2025
PDPL: ధాన్యం కొనుగోలుకు పటిష్ఠ కార్యాచరణ: అదనపు కలెక్టర్

ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో పెద్దపల్లి అదనపు కలెక్టర్ డి.వేణు రివ్యూ నిర్వహించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండేటట్లుగా చూసుకోవాలన్నారు.
News March 26, 2025
తిరుపతి: బాత్రూంలో జారిపడ్డ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ?

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఇంటిలోని బాత్రూంలో జారిపడి కుడి చేయికి దెబ్బ తగిలినట్లు సమాచారం. తిరుపతి-రేణిగుంట మార్గంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పెద్దిరెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కుడి చేయికి ఆపరేషన్ జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 26, 2025
నిర్మల్: ఆర్డీఓను కలిసిన డిపో మేనేజర్

నిర్మల్ డిపో మేనేజర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పండరి బుధవారం ఆర్డీఓ రత్న కళ్యాణిని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూల మొక్కను అందజేశారు. ఆర్టీసీ డీఎంతో పాటు అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, టీవీ రమణ, తదితరులు ఉన్నారు.