News March 25, 2024

విజయవాడ: బొండా తన రికార్డు చెరిపేస్తారా?

image

2008లో ఏర్పడ్డ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో మినహా ప్రతిసారి బొండా టీడీపీ తరపున బరిలో నిలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి విష్ణు చేతిలో 25 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిన ఆయన 2014లో 27,161 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. బొండా సాధించిన ఈ మెజారిటీనే సెంట్రల్‌లో అత్యధికం కాగా..2024లో టీడీపీ నుంచి మరోసారి బరిలో ఉన్న బొండా ఈ రికార్డును చెరిపేస్తారా.. కామెంట్ చేయండి.

Similar News

News November 1, 2025

కృష్ణా జిల్లాలో 630 మంది వితంతువులకు కొత్త పెన్షన్లు

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 630 మంది వితంతు మహిళలకు ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. నవంబర్ నెల మొదటి తేదీతో ప్రారంభమయ్యే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఈ కొత్త లబ్ధిదారులకు కూడా పెన్షన్ అందజేయనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వం ఈ జాబితాను విడుదల చేసింది. ఈ పెన్షన్ల మంజూరు ద్వారా ఎన్నో కుటుంబాలు ఆర్థిక భరోసా పొందారు.

News October 31, 2025

కార్తీక మాసానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ప్రారంభం

image

కార్తీకమాసంలో శైవక్షేత్రాలను దర్శిస్తే అపారమైన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కృష్ణాజిల్లా ఆర్టీసీ అధికారులు పంచారామాలు, అరుణాచలం, యాగంటి, మహానంది, శ్రీశైలం, మంత్రాలయం, వాడపల్లి వంటి ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపేలా ప్రణాళికలు రూపొందించారు.

News October 31, 2025

కాలువల్లో అడ్డంకులు తొలగిస్తున్నాం: కలెక్టర్

image

మొంథా తుఫాన్ కారణంగా ముంపుకు గురైన పొలాలలోని నీటిని బయటకు పంపేందుకు మురుగు కాలువలకు అడ్డంకులు తొలగించే విధంగా అవసరమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అమరావతి నుంచి RTG, HRD విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరయ్యారు.