News March 25, 2025
మంచిర్యాల: మంచిగా పని చేస్తే గుర్తింపు వస్తుంది: CP

చట్టబద్ధంగా మంచిగా పని చేసినప్పుడు తప్పక గుర్తింపు వస్తుందని CP అంబర్ కిషోర్ ఝా అన్నారు. నెలవారి సమీక్షలో భాగంగా సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. CPమాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే కార్యకలాపాలపై స్టేషన్ అధికారులకు ముందస్తు సమాచారం ఉండాలన్నారు. ప్రతి కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, SC,ST కేసుల్లో న్యాయంగా, పారదర్శకంగా విచారణ జరపాలని సూచించారు.
Similar News
News March 28, 2025
‘ఎల్2: ఎంపురాన్’పై విమర్శలు!

మోహన్‌లాల్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. అయితే, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఓ గ్రూప్ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టాయి. స్టార్టింగ్ ఎపిసోడ్ సహా మరికొన్ని సన్నివేశాలు కావాలనే చేసినట్టు ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. మతపరమైన వాటిలో తప్పుగా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో డైరెక్టర్ పృథ్వీరాజ్‌పై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
News March 28, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు!

@జిల్లాలోని నేటి 10వ తరగతి పరీక్షకు 7గురు గైర్హాజరు @ ధర్మపురి తహశీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల నిరసన@ కోరుట్ల ఏరియా ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం @ ధర్మపురి నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ@ పెగడపల్లి గ్రామపంచాయతీని తనిఖీ చేసిన మండల పంచాయతీ అధికారి@ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సమగ్ర గర్భస్రావ సంరక్షణ శిక్షణ @ రాయికల్ లో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు
News March 28, 2025
నిర్మాణ వ్యర్థాలపై కఠిన చర్యలు.. రూ.54 లక్షల పైగా పెనాల్టీలు

HYD నగరంలో నిర్మాణ, కూల్చివేత (C&D) వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేస్తున్న వారిపై టౌన్ ప్లానింగ్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. గత నాలుగు నెలల్లో అధికారులు రూ.54,15,792 పెనాల్టీలు విధించారు. కేవలం కాప్రా సర్కిల్లోనే రూ.7,27,500 జరిమానా విధించారు. పట్టణ శుభ్రతకు భంగం కలిగించే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.