News March 25, 2025
భార్య వీడియోలు షేర్ చేసే అర్హత భర్తకు లేదు: హైకోర్టు

భార్యతో సాన్నిహిత్యంగా గడిపిన వీడియోలను ఇతరులకు షేర్ చేసే అర్హత భర్తకు లేదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. భార్యకు భర్త యజమాని కాదని, ఆమెకంటూ సొంత హక్కులు, కోరికలు ఉంటాయని తెలిపింది. తామిద్దరం కలిసున్న వీడియోలను తన భర్త వీడియో తీసి FBలో అప్‌లోడ్ చేయడంపై ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Similar News
News January 25, 2026
నెల్లూరు జిల్లావ్యాప్తంగా పోలీస్ హై అలర్ట్: ఎస్పీ

గణతంత్ర దినోత్సవం, రథసప్తమి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ దేవాలయాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా ఉంచామన్నారు.
News January 25, 2026
హృతిక్ రోషన్‌కు ఏమైంది?

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నిన్న చేతి కర్రల సాయంతో నడుస్తూ కనిపించడం ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్లాక్ హుడీ, క్యాప్ ధరించిన ఆయన.. నడవడానికి ఇబ్బంది పడుతూ కనిపించారు. ఫొటోగ్రాఫర్లకు పోజులు ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు.
News January 25, 2026
కోహ్లీకి ఆ సత్తా ఉందని సచిన్ చెప్పారు: రాజీవ్ శుక్లా

తన రికార్డులను కోహ్లీ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని సచిన్ గతంలో తనతో చెప్పినట్లు BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా గుర్తు చేసుకున్నారు. ‘ఓ రోజు నేను సచిన్ ఇంటికి లంచ్‌కు వెళ్లాను. క్రికెట్‌లో మీరు చాలా రికార్డులు సృష్టించారని, వాటిని ఎవరు బ్రేక్ చేయగలరని సచిన్‌ను అడిగా. కోహ్లీకి ఆ సత్తా ఉందన్నారు’ అని రాజీవ్ తెలిపారు. అన్ని ఫార్మాట్లలో సచిన్ 100 సెంచరీలు చేయగా, కోహ్లీ ఇప్పటి వరకు 85 శతకాలు బాదారు.


