News March 25, 2025
పాడేరు: అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

పాడేరు, చింతూరు, రంపచోడవరం డివిజన్‌ల పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు-7, ఆయాలు-56, మినీ అంగన్వాడీ కార్యకర్తలు-27, పీఎం జనమన్ స్కీంలో కొత్తగా మంజురైన అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాలు-24 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈనెల 26 నుంచి వచ్చేనెల 10లోగా ఐసీడీఎస్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News March 30, 2025
కృష్ణా: UG పరీక్షా ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన UG 3వ, 5వ సెమిస్టర్ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
News March 30, 2025
VZM: జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. శనివారం గుర్లలో 42.1°C నమోదైంది. ఇవాళ కూడా జిల్లా వ్యాప్తంగా వడగాలులు, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనున్నాయి. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, చీపురుపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, కొత్తవలస, ఎల్.కోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, రామభద్రపురం, రేగిడి, ఎస్.కోట, తెర్లాం, వంగర మండలాల్లో దాదాపు 40°C నమోదవుతుందని APSDMA హెచ్చరించింది.
News March 30, 2025
ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి మూల్యాంకన: DEO

పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనను మొత్తం 1,032 మంది సిబ్బంది నిర్వహిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ తెలిపారు.ఏప్రిల్ 3 తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే మూల్యాంకనం రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు.111 మంది చీఫ్ ఎగ్జామినర్‌లు, 651 మంది ఎగ్జామినర్‌లు, 270 మంది స్పెషల్ అసిస్టెంట్లను ఇందు కోసం నియమించామన్నారు. ఒక ఎగ్జామినర్ ప్రతిరోజు 40 పేపర్‌లను మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు.