News March 25, 2025
శ్రీ సత్యసాయి జిల్లా: రేపు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బుధవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు జిల్లా కేంద్రంలోని షాదీ మహల్‌లో జరిగే ఇఫ్తార్ వేడుకలకు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు పార్లమెంటు సభ్యులు హాజరవుతారన్నారు.
Similar News
News November 3, 2025
హోమియో వైద్యాన్ని ప్రజలు ఆదరించాలి: డీఎంహెచ్‌ఓ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హోమియో వైద్య శిబిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) రవి రాథోడ్ పాల్గొన్నారు. దుష్ఫలితాలు లేని హోమియో మందులను ప్రజలు ఆదరించి, తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ శిబిరాన్ని 200 మందికి పైగా ప్రజలు ఉపయోగించుకున్నట్లు చెప్పారు.
News November 3, 2025
GNT: పత్తి రైతులకు కలెక్టర్ సూచన

రైతులు CM యాప్‌లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూపొందించిన పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. సీసీఐ ద్వారా క్వింటాలుకు రూ.8110 మద్దతు ధర ఉందన్నారు. ప్రత్తి కొనుగోలుకు నోటిఫైడ్ చేసిన జిన్నింగ్ మిల్లులలో రైతులు విక్రయించవచ్చన్నారు. CM యాప్‌లో (CM APP) నమోదు చేసుకుని, జిన్నింగ్ మిల్లు, విక్రయ తేదీ ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు.
News November 3, 2025
ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం

AP: తిరుపతిలోని SV యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సైకాలజీ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ విద్యార్థులను సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై సైకాలజీ డిపార్ట్‌మెంట్ HOD విశ్వనాథ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ‘ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు’ అని అన్నారని, విశ్వనాథ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.


