News March 25, 2025

NTR: జిల్లాకు ఆరంజ్ అలర్ట్- APSDMA

image

ఎన్టీఆర్ జిల్లాలో బుధవారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) మంగళవారం హెచ్చరించింది. వడగాడ్పులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. చందర్లపాడు 41.5, జి.కొండూరు 41.3, ఇబ్రహీంపట్నం 42.2, కంచికచర్ల 41.4, విజయవాడ రూరల్ 40.5, విజయవాడ అర్బన్ 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవనున్నట్లు తెలిపారు.

Similar News

News October 24, 2025

జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయండి: కలెక్టర్

image

జిల్లాలో ఈ-పంట, ఈ-కేవైసీ నమోదు నూరు శాతం పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను టెలికాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ఆదేశించారు. జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు పనిచేయాలన్నారు. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకానున్న దృష్ట్యా ఈ-క్రాప్ బుకింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

News October 24, 2025

MDK: సీటెట్ నోటిఫికేషన్ విడుదల..!

image

సీ–టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైనట్లు సీబీఎస్ఈ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా సీ–టెట్ పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://ctet.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 24, 2025

భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్: మెదక్ కలెక్టర్

image

భూభారతి దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించడానికి జిల్లాలో నవంబర్ 1 వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పది రోజుల్లో సుమారుగా వెయ్యి భూభారతి దరఖాస్తులు పరిష్కరిస్తామన్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా కలెక్టర్ ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రతిరోజు ఒక్కో తహశీల్దార్ పది ఫైల్స్ క్లియర్ చేసి ఆర్డీవోలకు పంపించాలని తెలిపారు.