News March 25, 2025
హనుమకొండ: కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్ నగరంలోని పాత ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్‌లో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జీ ప్లస్ టు కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి స్థాయిలో పనుల పురోగతిని బ్లూ ప్రింట్ మాప్ ప్రకారం పరిశీలించారు.
Similar News
News March 29, 2025
వికారాబాద్: అగ్నివీర్‌కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని మదనంతాపూర్ గ్రామానికి చెందిన అరవింద్, మంబాపూర్ గ్రామానికి చెందిన అరుణ్ కుమారులు అగ్నివీర్ కు ఎంపికయ్యారు. మండలం నుంచి ఈ ఏడాది ఇద్దరు ఎంపిక కావడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరువురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే కావడం గమనార్హం.
News March 29, 2025
అమలాపురం: ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచనలు

ఈ ఏడాది రికార్డు స్థాయిలో వడగాల్పులు ఉంటాయన్న వాతవరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ప్రజలకు సూచించారు. వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై శుక్రవారం సమీక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జనసంచారం, భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.
News March 29, 2025
MBNR: ‘కవులకు పుట్టినిల్లు.. పాలమూరు’

పాలమూరు జిల్లా కవులకు పుట్టినిల్లని MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఓ కవి సమ్మేళనంలో.. తెలంగాణలో కవులే లేరని ఆంధ్ర కవి అనగా.. సురవరం ప్రతాపరెడ్డి 354 మంది కవులతో గోలకొండ కవుల సంచిక గ్రంథాన్ని రాసి చరిత్ర సృష్టించారన్నారు. ముకురాల రామారెడ్డి, రుక్ముద్దీన్, రాళ్లపల్లి అనంత శర్మ, పాకాల యశోదా రెడ్డి, కపిలవాయి లింగమూర్తి కవులు పాలమూరు ఖ్యాతిని పెంచారన్నారు.