News March 25, 2025
స్వదేశీ MRI మెషీన్.. అక్టోబర్ నుంచి ట్రయల్స్

తొలి స్వదేశీ MRI మెషీన్‌ను భారత్ అభివృద్ధి చేసినట్లు ఎయిమ్స్ ఢిల్లీ తెలిపింది. అక్టోబర్ నుంచి ట్రయల్స్ కోసం ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో టెస్టుల ఖర్చులతో పాటు విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశముందని వెల్లడించింది. ఈ మెషీన్ వైద్య సాంకేతికతలో భారత్‌ను స్వావలంబన దిశగా నడిపించడంలో సహాయపడనుంది.
Similar News
News March 29, 2025
ఏపీలో వాటర్ ఎయిర్ పోర్టులు.. సీఎం కీలక ఆదేశాలు

AP: పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు సీ ప్లేన్ సేవల్ని ఆరంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్, వైజాగ్ సముద్రతీరాల్లో నీటి విమానాశ్రయాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని CM చంద్రబాబు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ(APADC)కు సూచించారు. దీంతో అధ్యయనానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి APADC వచ్చే 3లోపు ప్రతిపాదనల్ని ఆహ్వానించింది.
News March 29, 2025
ధోనీ ముందే రావచ్చుగా.. ఫ్యాన్స్ ఆవేదన

నిన్న RCB చేతిలో CSK ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. చెన్నై 6 వికెట్లు కోల్పోయి 28 బంతుల్లో 98 పరుగులు చేయాల్సిన సమయంలో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చారు. 16 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సీఎస్కే బ్యాటర్లలో ఆయనదే అత్యధిక స్ట్రైక్ రేట్. ఇలా ఆడే సామర్థ్యం ఉన్న ఆయన జడేజా, అశ్విన్ కంటే ముందు వచ్చి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లం కదా అంటూ సీఎస్కే ఫ్యాన్స్ నెట్టింట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 29, 2025
రేపు, ఎల్లుండి ఆస్తి పన్ను వసూలు కౌంటర్లు ఓపెన్

AP: ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీ గడువు ఈనెల 31తో ముగియనుంది. 3 రోజులే అవకాశం ఉండడంతో ఈనెల 30, 31 తేదీల్లోనూ పన్ను వసూళ్ల కౌంటర్లు పనిచేసేలా మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉ.6 నుంచి రా.9 గంటల వరకు కౌంటర్ల వద్ద పన్ను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.