News March 25, 2025
ఆ YCP నేతకు తాడిపత్రిలోకి NO ENTRY

ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన YCP ముస్లిం మైనార్టీ నేత ఫయాజ్ బాషాను పది రోజులపాటు తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు బహిష్కరించారు. గత 3రోజుల క్రితం ఫయాజ్ బాషా, JC ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. రంజాన్ సందర్భంగా.. ఎలాంటి అల్లర్లు జరగకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఫయాజ్ బాషాను పోలీసులు అనంతపురం తరలించారు.
Similar News
News March 30, 2025
వరంగల్: నేడు, రేపు.. అవి తెరిచే ఉంటాయి!

వరంగల్ మహా నగర పాలక సంస్థ పన్నుల వన్ టైమ్ సెటిల్మెంట్ చెల్లింపు కోసం నేడు(ఆదివారం), రేపు(సోమవారం) మీ సేవా కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ కేంద్రాలు తెరిచే ఉండనున్నాయి. వన్ టైమ్ సెటిల్మెంట్ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రజల కోసం ఈ అవకాశాన్ని కల్పించినట్లు గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. పాత బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ మినహాయింపు పొందాలన్నారు.
News March 30, 2025
HYD: పంజాగుట్ట కేసు.. ఇన్‌స్టా రీల్స్‌లో మార్పు!

బెట్టింగ్ ప్రమోషన్స్ వ్యవహారంలో సజ్జనార్ ఉద్యమంతో పంజాగుట్ట PSలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో గతంలో తెలిసి తెలియక ప్రమోట్ చేసిన వారే ఇప్పుడు బెట్టింగ్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేస్తున్నారు. డబ్బులు తగలబెట్టి మరీ ఈజీగా మనీ సంపాదించవచ్చు అని అమాయకులను ప్రలోభ పెట్టినవారు HYD పోలీసుల చర్యలతో పరారీ అవుతున్నారు. ఇక ఇన్‌స్టా రీల్స్‌లోనూ జనాలను మభ్య పెట్టే ప్రమోషన్స్ తగ్గడం విశేషం.
News March 30, 2025
అంగళ్లు : గ్యాస్ సిలిండర్ పేలి గాయపడ్డ వ్యక్తి మృతి

అంగళ్లులో గ్యాస్ సిలిండర్ పేలి గాయపడ్డ టీ కొట్టు నిర్వాహకుడు కృష్ణయ్య మృతి చెందాడని పోలీసులు ఆదివారం తెలిపారు. కురబలకోట మండలం, అంగళ్లులో ఈనెల 22 న టీ కొట్టు నడుపుతుండగా గ్యాస్ సిలిండర్ పేలి కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డారు. బాధితున్ని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించారు. రుయాలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.