News March 25, 2025
నాకోసం యువీ ఎండలో నిలబడేవారు: KKR డేంజరస్ బ్యాటర్

తన బ్యాటింగ్ స్కిల్ మెరుగవ్వడంలో ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ పాత్ర ఉందని KKR యువ బ్యాటర్ రమణ్‌దీప్ సింగ్ అన్నారు. ఆయనలా బ్యాటింగ్ చేయాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. ‘యువీ కొన్నిసార్లు తన ప్రాక్టీస్ వదిలి నేను ప్రాక్టీస్ చేసే PCA స్టేడియం వచ్చేవారు. కొన్నిసార్లు అంపైర్ ప్లేస్‌లో ఎండలో నిలబడి గంటల కొద్దీ వీడియోలు రికార్డు చేసేవారు. వాటిని ఇంటికెళ్లి విశ్లేషించి నాకు సలహాలు ఇచ్చేవారు’ అని తెలిపారు.
Similar News
News March 28, 2025
‘కాంతార’లో యాక్టింగ్.. మోహన్ లాల్ రెస్పాన్స్ ఇదే..!

కాంతార-2 చిత్రంలో నటించడంపై మోహన్ లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక రిపోర్టర్ కాంతారలో నటిస్తున్నారా అని అడగగా ‘మీరు ఆ చిత్రంలో పాత్రను ఇప్పించండి, నేను అంత చెడ్డ నటుడని కాదు’ అని బదులిచ్చారు. దీంతో కాంతార-2 మోహన్ లాల్ నటించట్లేదని భావిస్తున్నారు. 2022 విడుదలైన కాంతార భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. దీని ప్రీక్వెల్‌ని ఈ ఏడాది అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
News March 28, 2025
చాట్ జీపీటీని దాటేసిన గ్రోక్

ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బోట్ ‘గ్రోక్’ సంచలనం సృష్టిస్తోంది. అమెరికా గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ టాప్ ఫ్రీ లిస్టులో అగ్రస్థానానికి చేరింది. ఈ క్రమంలో గ్రోక్.. చాట్ జీపీటీ, టిక్‌టాక్‌ను దాటేసినట్లు మస్క్ ట్వీట్ చేశారు. గ్రోక్ ఆండ్రాయిడ్ యాప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి వచ్చింది.
News March 28, 2025
RCBతో మ్యాచ్.. CSK 26/3

RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో CSKకు బిగ్ షాక్ తగిలింది. 4.4 ఓవర్లలో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి 5, కెప్టెన్ రుతురాజ్ 0, దీపక్ హుడా 4 పరుగులకే ఔటయ్యారు. జోస్ హేజిల్‌వుడ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చేశారు. భువనేశ్వర్ ఒక వికెట్ తీశారు. క్రీజులో రచిన్ 16, కర్రన్ 0 ఉన్నారు.