News March 25, 2025
27న జగిత్యాల, ధర్మపురిలో పర్యటించనున్న బీసీ కమిషన్

ఈ నెల 27న తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు జగిత్యాల, ధర్మపురి ప్రాంతాలలో పర్యటిస్తారని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మంగళవారం తెలిపారు. జిల్లాలోని వంశరాజ్, వీరబద్రియ, దొమ్మర కులాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి వస్తున్నారని కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను, వినతులను కమిషన్‌కు సమర్పించాలని కోరారు.
Similar News
News November 28, 2025
గూడూరు జంక్షన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరిలో గూడూరు మీదుగా వెళ్లే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. జనవరి 27న తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ (17480), 28న పూరి-తిరుపతి (17479), తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ (22708), 29న విశాఖ-తిరుపతి డబుల్ డెక్కర్ (22707) రద్దు కానున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
News November 28, 2025
మరిపెడలో అత్యధికం.. చిన్నగూడూరులో అత్యల్పం!

మహబూబాబాద్ జిల్లాలో 482 గ్రామపంచాయతీలు, 4110 వార్డు స్థానాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు అత్యధికంగా మరిపెడ మండలంలో ఉండగా.. అత్యల్పంగా చిన్నగూడూరు మండలంలో ఉన్నాయి. మరిపెడ(M)లో 48 పంచాయతీలు, 396 వార్డులు ఉన్నాయి. చిన్నగూడూర్(M)లో 11 గ్రామ పంచాయతీలు, 96 వార్డులు ఉన్నాయి.
News November 28, 2025
HYD: అభివృద్ధికి నిదర్శనంగా ఆదిబట్ల !

ఆదిబట్ల మున్సిపాలిటీ హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనంగా మారింది. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న ఆదిభట్ల మున్సిపాలిటీ ప్రస్తుతం మినీ గచ్చిబౌలిగా పేరుగాంచింది. IT సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలకు నిలయంగా ఉంది. మాజీ సీఎం YS రాజశేఖర్ రెడ్డితో ఆదిభట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఆయన హయాంలోనే ప్రతిష్టాత్మకమైన టాటా సంస్థను ఇక్కడికి తీసుకొచ్చారు. కాగా, అప్పటి ఆదిత్యనగర్ కాస్త కాలక్రమంగా ఆదిభట్లగా పేరు పొందింది.


