News March 25, 2025
రూ. 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మరిచిన BJP: యూత్ కాంగ్రెస్

బీజేపీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరచిపోయిందంటూ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో సంగారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మున్నూరు రోహిత్ మంగళవారం పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు యూత్ కాంగ్రెస్ ధర్నాలు చేస్తామని తెలిపారు.
Similar News
News March 29, 2025
OUలో రివాల్యుయేషన్‌కు అవకాశం

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏ లాంగ్వేజెస్ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బీఏ లాంగ్వేజెస్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. ఈ రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపరుకు రూ.500 చొప్పున చెల్లించి వచ్చే నెల 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 29, 2025
ఏపీలో వాటర్ ఎయిర్ పోర్టులు.. సీఎం కీలక ఆదేశాలు

AP: పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు సీ ప్లేన్ సేవల్ని ఆరంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్, వైజాగ్ సముద్రతీరాల్లో నీటి విమానాశ్రయాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని CM చంద్రబాబు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ(APADC)కు సూచించారు. దీంతో అధ్యయనానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి APADC వచ్చే 3లోపు ప్రతిపాదనల్ని ఆహ్వానించింది.
News March 29, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి దర్శనం

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం శనివారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ్ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబంది, భక్తులు ఉన్నారు.