News March 25, 2025
టేకుమట్ల: ఘోర రోడ్డు ప్రమాదం (UPDATE)

టేకుమట్ల మండలంలోని రామకృష్ణాపూర్(టి) సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో వరి పొలంలో పనికి సిద్ధమవుతున్న కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ క్రమంలో మోకిడి సంధ్య (30), పూలమ్మ (51) అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో ప్రేమానురాగాలు పంచే తల్లులు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి పిల్లల రోదనలు మిన్నంటాయి.
Similar News
News March 29, 2025
TODAY HEADLINES

✒ మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపం.. దాదాపు 180 మంది మృతి
✒ భూకంప ప్రభావిత దేశాలకు అండగా ఉంటాం: మోదీ
✒ కేంద్ర ఉద్యోగులకు 2% DA పెంపు
✒ AP: 31న జరగాల్సిన టెన్త్ పరీక్ష APR 1కి వాయిదా
✒ తెలుగువారే అగ్రస్థానంలో ఉండాలి: CBN
✒ ఓబుళాపురం మైనింగ్ కేసుపై మే 6న తీర్పు
✒ ఇంటి స్థలం లేని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు: పొంగులేటి
✒ మా శ్రమతోనే BYD రాష్ట్రానికి వచ్చింది: KTR
✒ మే 1 నుంచి ATM ఛార్జీల పెంపు
News March 29, 2025
నోటిఫికేషన్ విడుదల

AP: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (PGECET) నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీటెక్/బీఫార్మసీ పాసైన లేదా చివరి ఏడాది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. 120 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది.
News March 29, 2025
ఆర్సీబీ చేతిలో చెన్నై చిత్తు

IPL: సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన బెంగళూరు.. చెన్నైని సునాయాసంగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB 20 ఓవర్లలో 196/7 రన్స్ చేసింది. అనంతరం చెన్నై 146 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 50 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రచిన్ ఒక్కడే 41 పరుగులతో రాణించారు. చివర్లో ధోనీ (30*) రెండు సిక్సర్లు కొట్టి అభిమానుల్లో జోష్ నింపారు.