News March 25, 2025

BNR: నిర్వాసితులకు అన్ని రకాల మౌలిక వసతులు: R&R కమిషనర్

image

ఉదండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు కేటాయించిన అర్&అర్ కాలనీలలోఅన్ని రకాల మౌలిక సౌకర్యాలు వేగవంతం చేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో అర్&అర్ పనులను సమీక్షించారు.

Similar News

News January 14, 2026

పాలమూరు: ఈనాటి ముఖ్య వార్తలు!!

image

✒T-20 లీగ్.. అదిలాబాద్ పై మహబూబ్ నగర్ ఘనవిజయం
✒అభివృద్ధి కేంద్ర నిధులతోనే: ఎంపీ డీకే అరుణ
✒ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు
✒పలు గ్రామాల్లో క్రీడా పోటీలు
✒పాలమూరు: రోడ్డు ప్రమాదం.. తల్లీకుమార్తె మృతి
✒GDWL:భార్య కాపురానికి రావడంలేదని గొంతు కోసుకున్న భర్త
✒నాగర్‌కర్నూలు: ఐదుగురు ఏఈఓల సస్పెన్షన్
✒ఈనెల 19 నుంచి జోగులాంబ బ్రహ్మోత్సవాలు

News January 13, 2026

MBNR: సిరి వెంకటాపూర్‌లో 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత

image

మహబూబ్‌నగర్‌ జిల్లాలో గత 24 గంటల్లో చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో అత్యల్పంగా 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేవరకద్రలో 15.5, కొల్లూరులో 17.9, కౌకుంట్ల 18.0, సల్కర్‌పేటలో 18.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన కొద్దిరోజులతో పోలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో జిల్లా ప్రజలకు చలి నుంచి కాస్త ఉపశమనం లభించింది.

News January 12, 2026

కేటీఆర్ పాలమూరు పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. HYD నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి MBNRకు చేరుకుంటారు. 11 గంటలకు పట్టణంలోని పిస్తా హౌస్ నుంచి ఎంబీసీ గ్రౌండ్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు జిల్లాలో నూతనంగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లను కేటీఆర్ సన్మానించనున్నారు.