News March 25, 2025

డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖ జిల్లాలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ & రీసెర్చ్ సెంటర్లు, రీజినల్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు ఉప రవాణా కమీషనర్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రవాణా శాఖ మార్గదర్శకాల ప్రకారం అర్హతగల సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ www.morth.nic.in లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 29, 2025

విశాఖ: టీడీపీ జిల్లా కార్యాలయంలో వేడుకలు 

image

విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొని ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 43 ఏళ్లుగా నిర్విరామంగా ప్రజల కష్టాలను తీరుస్తూ, దేశ రాజకీయ చరిత్రలోనే టీడీపీ ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే లు గంటా శ్రీనివాస్‌రావు, వెలగపూడి రామకృష్ణ బాబు, గండి బాబ్జి ఉన్నారు.

News March 29, 2025

విశాఖ: ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

image

విశాఖ పీఎంపాలెం ఏసీఏ-వీసీడిఏలో నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైనట్లు శనివారం నిర్వాహకులు తెలిపారు. ఆదివారం కావడంతో అధికసంఖ్యలో ప్రేక్షకులు వస్తారన్న అభిప్రాయంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రేపు ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ అభిమానులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్లాక్ టికెట్ల కట్టడికి పోలీసులు నిఘా ఉంచినట్లు తెలిపారు.

News March 29, 2025

గాజువాకలో యువకుడి ఆత్మహత్య

image

గాజువాకలో తెల్లవారుజామున యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసుల వివరాల ప్రకారం.. సాలూరుకు చెందిన వసంతుల సతీశ్ కుమార్ అనే యువకుడు విశాఖలోని ఓ ఫార్మా ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి చైతన్య నగర్‌లోని రూములో స్నేహితుడు రాజశేఖర్‌తో కలిసి పడుకున్నాడు. తెల్లవారుజామున ఫ్యాన్ ఆగిపోవడంతో రాజశేఖర్ లేచి చూసేసరికి సతీశ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు.

error: Content is protected !!