News March 25, 2025
నేనెప్పుడు కేసీఆర్‌ను కించపరచలేదు: జూపల్లి

TG: తానెప్పుడూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కించపరచలేదని, భవిష్యత్తులోనూ కించపరచబోనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనంటే ఉద్యమం నుంచి గౌరవం ఉందని చెప్పారు. అయితే సోనియాగాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. మూడు లక్షల అదనపు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
Similar News
News September 14, 2025
ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం విఫలం: YCP

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను YCP నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్, మొండితోక జగన్మోహన్ తదితరులు బాధితులతో మాట్లాడారు. ‘న్యూరాజరాజేశ్వరిపేటలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. డోర్2డోర్ సర్వే చేసి బాధితుల వివరాలు సేకరించాలి. డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థలను మెరుగుపరచాలి. మెడికల్ క్యాంపుల ద్వారా వారికి భరోసా ఇవ్వాలి’ అని వారు పేర్కొన్నారు.
News September 14, 2025
జొన్న: కాండం తొలుచు పురుగు.. నివారణ

* పంట వేసిన 35 రోజుల నుంచి కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఎకరానికి 4 కేజీల కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలను కాండం సుడుల్లో వేయాలి.
* కత్తెర పురుగు లార్వా దశలో ఉంటే వేపనూనె(అజాడిరక్టిన్) 1500 పిపిఎం 5 ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* పురుగు తీవ్రత అధికంగా ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 ML, ఒక లీటరు నీటికి కలిపి సుడుల్లో పడేలా పిచికారీ చేయాలి.
News September 14, 2025
కొడుకును చంపి నదిలో పడేశాడు!

TG: హైదరాబాద్ బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు అనాస్(3)ను తండ్రి అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీ నదిలో పడేశాడు. అనంతరం బాలుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.