News March 25, 2025
రానున్న 4 రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలో రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణం కంటే 2-3°C ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. వారం నుంచి పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వేడిగాలులతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గాయి. అలాగే ఈ నెల 30 వరకు వర్షాలు పడే ఆస్కారం లేదని, పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. వడదెబ్బ సోకకుండా ప్రజలు నీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News September 19, 2025
CM రేవంత్ ఇవాళ్టి ఢిల్లీ షెడ్యూల్

ఢిల్లీ: CM రేవంత్ ఉ.11గం.కు తాజ్ ప్యాలెస్‌లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి.మర్ఫీతో సమావేశమవుతారు. ఉ.11:30గం.కు బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే 12వ వార్షిక ఫోరమ్‌లో ప్రసంగిస్తారు. మ.12గం.కు అమెజాన్, కార్ల్స్ బర్గ్, గోద్రెజ్, ఉబర్ కంపెనీల ప్రతినిధులను పెట్టుబడులపై కలుస్తారు. మ.12:30గం.కు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జ్ బ్రెండేతో ప్రత్యేక భేటీ ఉంటుంది.
News September 19, 2025
భారత్-చైనాని ట్రంప్ భయపెట్టలేరు: రష్యా మంత్రి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బెదిరింపులు భారత్-చైనాలను భయపెట్టలేకపోయాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. ‘నాకు నచ్చనిది చేయకండి టారిఫ్స్ విధిస్తాను అన్న ధోరణి ప్రాచీన నాగరికత కలిగిన భారత్, చైనా విషయంలో పనిచేయదు. అమెరికాకు అది అర్థమవుతోంది. సుంకాలు వేస్తే ఆ దేశాలను ఇంధనం, మార్కెట్ వంటి రంగాల్లో ఆల్టర్నేటివ్స్ వైపు మళ్లిస్తాయి’ అని తెలిపారు.
News September 19, 2025
Bigg Boss: ఆ ముగ్గురు డేంజర్ జోన్‌లో!

ఈ వారం నామినేషన్స్‌లో సుమన్ శెట్టి, పవన్, ప్రియ, భరణి, ఫ్లోరా, మనీశ్, హరీశ్ ఉన్నారు. ఈ ఏడుగురిలో సుమన్ శెట్టి ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హరీశ్, ఫ్లోరా కూడా మంచి పొజిషన్‌లోనే ఉండొచ్చు. కానీ మనీశ్, పవన్, ప్రియ డేంజర్ జోన్‌లో ఉండే ప్రమాదం ఎక్కువ కనిపిస్తోంది. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని రివ్యూవర్స్ ప్రిడిక్ట్ చేస్తున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? కామెంట్ చేయండి.