News March 26, 2025

మళ్లీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నా: నటాషా

image

హార్దిక్ పాండ్యతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నట్లు నటాషా తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు నచ్చిన భాగస్వామి దొరకడం ఖాయమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రేమ మాత్రమే కాదు పరస్పరం గౌరవించుకునే అనుబంధాలను తాను ఇష్టపడతానని పేర్కొన్నారు. మళ్లీ మోడలింగ్, నటనను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

Similar News

News March 29, 2025

మయన్మార్‌లో మరోసారి భూకంపం

image

మయన్మార్‌లో మళ్లీ భూకంపం వచ్చింది. ఆ దేశ రాజధాని నేపిడా సమీపంలో భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు తెలిపాయి. 24గంటల వ్యవధిలో 15సార్లు ఆ దేశంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. నిన్న 7.7 తీవ్రతతో మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భారీ భూకంపానికి 1000 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.

News March 29, 2025

చెన్నై కెప్టెన్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం

image

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై ఆ టీమ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘మేము 50 పరుగుల తేడాతోనే ఓడిపోయాం. ఇదేమీ భారీ మార్జిన్ కాదు’ అని నిన్న గైక్వాడ్ అన్నారు. టీ20లో 50 రన్స్ తేడాతో ఓడిపోవడం అంటే భారీ కాదా? అని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ మైండ్‌సెటే ఇలా ఉంటే.. గెలవాలన్న కసి జట్టులోని మిగతా ప్లేయర్లకు ఎలా ఉంటుందని నిలదీస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 29, 2025

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లే వాట్సాప్‌లో స్టేటస్ ఫొటోలకు మ్యూజిక్ యాడ్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇందులో లైసెన్స్డ్ ట్రాక్స్ మాత్రమే వాడొచ్చు. సొంత పాటలను అప్డేట్ చేస్తామంటే అనుమతించదు. ఈ ఫీచర్ వాడేందుకు వాట్సాప్ ఓపెన్ చేయాలి> న్యూ స్టేటస్ క్లిక్ చేయాలి> ఫొటో/ వీడియో తీసుకోవాలి> పైన మ్యూజిక్ బటన్ నొక్కాలి> మ్యూజిక్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది> మీకు నచ్చిన పాట సెలక్ట్ చేసుకోవాలి.

error: Content is protected !!