News March 26, 2025

‘లిప్ లాక్’ కోసం బ్రష్ చేసుకోమన్నా: నటి

image

మలయాళ సినిమా ‘రైఫిల్ క్లబ్’ షూటింగ్ సమయంలో తన అనుభవాలను నటి సురభి లక్ష్మి పంచుకున్నారు. ఈ సినిమాలో కీలకమైన ముద్దు సన్నివేశంలో నటించే ముందు సహా నటుడు సజీవ్ కుమార్‌ను బ్రష్ చేసుకొని రమ్మన్నానని తెలిపారు. ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉండటమే దానికి కారణమన్నారు. తానూ యాలకులు తిన్నట్లు పేర్కొన్నారు. ఈ సన్నివేశాన్ని సాధారణ సీన్ లాగే చిత్రీకరించాలని కోరినట్లు చెప్పారు. రొమాంటిక్ సీన్స్ నటనలో భాగమేనన్నారు.

Similar News

News November 10, 2025

తక్షణ సాయంగా ₹901 కోట్లు ఇవ్వండి: AP

image

AP: మొంథా తుఫాను నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ₹6384CR న‌ష్టం వాటిల్లిందని, ₹901.4 కోట్లు త‌క్ష‌ణ సాయంగా అందించాలని రాష్ట్ర అధికారులు కోరారు. 1.61 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌లు దెబ్బ‌తిన్న‌ట్లు చెప్పారు. ఉద్యాన‌, మ‌ల్బ‌రీ తోట‌లూ దెబ్బతిన్నాయని వివరించారు. 4,794KM రోడ్లు, 3,437 మైనర్ ఇరిగేషన్ ప‌నులు, 2,417 ఇతర ప్రాజెక్టులకు న‌ష్టం వాటిల్లిందని తెలిపారు.

News November 10, 2025

రాకెట్ ఉమెన్ ఆఫ్‌ ఇండియా

image

చిన్నతనం నుంచే అంతరిక్షంపై మక్కువ పెంచుకుని శాస్త్రవేత్త కావాలనుకున్నారు రీతూ కరిధాల్. లక్నోలో జన్మించిన ఈమె 1997లో ఇస్రోలో చేరారు. చంద్రయాన్-2కు మిషన్ డైరక్టర్‌గా వ్యవహరించడంతో పాటు మార్స్ ఆర్బిటార్, మంగళయాన్, చంద్రయాన్-3లో ప్రధానపాత్ర పోషించారు. రాకెట్ ఉమెన్ ఆఫ్‌ ఇండియా బిరుదుతోపాటు అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇస్రోయంగ్ సైంటిస్ట్ అవార్డు, ఫోర్బ్స్ ఇండియా సెల్ఫ్ మేడ్ ఉమెన్-2020 జాబితాలో నిలిచారు.

News November 10, 2025

శివుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి?

image

☛ విషాన్ని ఆయన గొంతులోనే ఉంచుకొని లోకాన్ని రక్షించినట్లు, మన జీవితంలోని ప్రతికూలతలను నియంత్రించడం నేర్చుకోవాలి.
☛ ఆయన నుదుటిపై మూడో కన్ను జ్ఞానం, వివేకానికి చిహ్నం. అలాంటి వివేకంతో సత్యాసత్యాలను, మంచి-చెడులను గుర్తించే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
☛ శివుడు భస్మం, రుద్రాక్షలతో నిరాడంబరంగా ఉంటాడు. నిజమైన శక్తికి ఆడంబరాలు అనవసరమని అర్థం. ☛ ధ్యానంతో మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, ఏకాగ్రత పెంచుకోవాలి.