News March 26, 2025

సుప్రీంకు చేరిన అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద తీర్పు

image

పోక్సో కేసు విచారణ సందర్భంగా ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ‘వక్షోజాలు పట్టుకోవడం, పైజామా నాడా తెంచడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం కాదు’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై మహిళా సమాజంతో పాటు న్యాయ నిపుణులు మండిపడ్డారు. ఈ తీర్పుపై దాఖలైన పిటిషన్‌ను సోమవారం తిరస్కరించిన సుప్రీం.. ఇవాళ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. రేపు ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.

Similar News

News November 12, 2025

గ్రామ పంచాయతీలకు శుభవార్త

image

AP: పట్టణాభివృద్ధి సంస్థల(UDA) పరిధిలోని గ్రామ పంచాయతీల్లో భూవినియోగ మార్పిడికి ఎక్స్‌టర్నల్ డెవలప్‌మెంట్ ఛార్జ్(EDC) విధిస్తారు. ఇందులో 15% UDAలకు, 85% పంచాయతీలకు చెందేలా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నగదు UDA ఖాతాల్లోకి వెళితే తిరిగి రావడం కష్టమని అధికారులు అభిప్రాయపడటంతో వాటా మొత్తం నేరుగా పంచాయతీల ఖాతాలకే జమ అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో గ్రామాలకు అదనపు ఆదాయం లభించనుంది.

News November 12, 2025

పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

image

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్‌కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్‌ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. దీన్నే ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటారు. మధుమేహం, థైరాయిడ్, బీపీ ఉంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్‌పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

News November 12, 2025

ఒకే వేదికపైకి రష్మిక, విజయ్..! అధికారికంగా ప్రకటిస్తారా?

image

ప్రేమ, త్వరలో పెళ్లి వార్తల వేళ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ ఇవాళ ఒకే వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి విజయ్ చీఫ్ గెస్ట్‌గా వస్తారని సమాచారం. ఈ వేదికగా తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.