News March 26, 2025
VKB జిల్లాలో నేటి TOP NEWS..!

✔ VKB: ఇంగ్లిష్ పరీక్షకు 61 మంది డుమ్మా..! ✔ఎమ్మెల్యేపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: స్పీకర్ ✔VKB:బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు ✔VKB: GPO పోస్టులకు ఈనెల 26, 27న అవగాహన ✔పరిగిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు ✔ తాండూరు పుర సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ✔ పలుచోట్ల ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు ✔VKB జిల్లాలో గ్రామాల పేర్ల మార్పుకు సిద్ధం: మంత్రి సీతక్క ✔కేబినెట్ విస్తరణ.. VKBకు NO ఛాన్స్?.
Similar News
News March 29, 2025
చిత్తూరు జిల్లా ప్రథమ స్థానం: కలెక్టర్

చిత్తూరు జిల్లా పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో, ఎన్‌ఇసిసి సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రైతాంగం వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమపై ఎక్కువ మంది రైతులు ఆధారపడి ఉన్నారన్నారు.
News March 29, 2025
సంగారెడ్డిలో దివ్యాంగులకు అవగాహన సదస్సు

ఏప్రిల్ 3 సంగారెడ్డి కలెక్టర్ ఆడిటోరియంలో దివ్యాంగుల అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికి యుడిఐడి కార్డు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తెలిపారు. కావున జిల్లాలోని దివ్యాంగులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల దివ్యాంగుల సంఘాల నాయకులు హాజరు కావాలన్నారు.
News March 29, 2025
జగ్గన్నపేటలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క

ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఓపెన్ టెక్స్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెనుకబడిన ములుగు జిల్లాలో గిరిజన గ్రామాలను దత్తత తీసుకోవడానికి స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.