News March 26, 2025
చక్రయ్య హత్య కేసులో మరో 15 మంది అరెస్ట్

సూర్యాపేట జిల్లా మిర్యాల మాజీ సర్పంచ్ చక్రయ్య హత్య కేసుకు సంబంధించి మరో 15 మందిని ఎర్రపహాడ్ క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేసినట్లు తుంగుతుర్తి CI శ్రీను తెలిపారు. A-9 నాగరాజు, A-11 భరత్, A-13గంగమల్లు, A-18 సంతోష్, A-19సతీష్, A-27నాగయ్య, A-28 మల్లయ్య, A-32 వెంకన్న, A-33 మహేష్, A-34 రాకేష్, A-36 సైదులు, A-37 శ్రీధర్, A-38 మహేష్, A-39 వెంకన్న, A-40 లింగుస్వామిలకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: చైనా, పాక్

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, దాని వింగ్ ‘మజీద్ బ్రిగేడ్’ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని UN సెక్యూరిటీ కౌన్సిల్‌లో చైనా, PAK జాయింట్ బిడ్ సబ్మిట్ చేశాయి. AFG అభయారణ్యాల నుంచి ఈ సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరాయి. US గత నెలలో వీటిని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిందని.. కరాచీ ఎయిర్‌పోర్ట్, జాఫర్ ట్రైన్ హైజాక్‌లో వీటి ప్రమేయం ఉందని తెలిపాయి.
News September 18, 2025
కల్వకుర్తి: బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలు

కల్వకుర్తి మండలంలో గురువారం ఉదయం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కుర్మిద్ద గ్రామానికి చెందిన ఇద్దరు స్కూటీపై కల్వకుర్తికి వెళ్తుండగా కాటన్ మిల్లు సమీపంలో వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ లభ్యం

తుర్కపల్లి మండలం రుస్తాపురం సమీపంలోని చోక్లా తండాలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను పోలీసులు గుర్తించి, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. బస్వాపూర్ ప్రాజెక్టు పనుల కోసం మధ్యప్రదేశ్, బిహార్ నుంచి వచ్చిన కూలీల పిల్లలు గురువారం ఉదయం తప్పిపోయారు. తల్లిదండ్రులు తుర్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, కొద్దిసేపటికే చిన్నారుల ఆచూకీ గుర్తించారు.