News March 26, 2025

యాదగిరి శ్రీవారి నిత్యా ఆదాయం రూ.22,79,976.

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి
నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో
భాస్కరరావు వెల్లడించారు. మంగళవారం
900మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.45,000, ప్రసాద విక్రయాలు రూ.8,02,180, VIP దర్శనాలు రూ.1,80,000, బ్రేక్ దర్శనాలు రూ.1,25,700, కార్ పార్కింగ్ రూ.2,06,000, వ్రతాలు రూ.66,400, ప్రధాన బుకింగ్ రూ.1,34,650, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.22,79,976 ఆదాయం వచ్చింది.

Similar News

News November 4, 2025

పురుగు మందుల పిచికారీ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

☛ పురుగు మందుల పిచికారీకి అవసరాన్ని బట్టి తగిన స్ప్రేయర్, నాజిల్స్ ఎన్నుకోవాలి. ☛ ద్రావణం తయారీకి మంచినీరే వాడాలి. సిఫార్సు చేసిన మోతాదునే పిచికారీ చేయాలి. తక్కువ వాడితే మందు పనిచేయదు. ఎక్కువ వాడితే పురుగు రోగనిరోధక శక్తిని పెంచుకుంటుంది. ☛ ఎండ తీవ్రత, గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు, మంచు కమ్మినప్పుడు, వర్షం కురిసే ముందు పిచికారీ చేయరాదు. ☛ జలాశయాలు, చెరువులు, నీరుండే చోటు దగ్గరలో మందు కలపకూడదు.

News November 4, 2025

జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 28.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. చిన్నచింతకుంట 19.5, మిడ్జిల్ 11.3, కౌకుంట్ల 18.8, దేవరకద్ర 17.0, మహబూబ్‌నగర్ గ్రామీణ 9.8, అడ్డాకుల 8.5, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 5.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News November 4, 2025

VZM: రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ధి

image

విజయనగరం జిల్లాలో 109 చిన్నతరహా చెరువులను రూ.55 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. చెరువుల అభివృద్ధిపై నేడు సమావేశం నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ పథకం క్రింద ఐదు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో ఈ చెరువులు అభివృద్ధి కానున్నాయని చెప్పారు. మొత్తం మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలన్నారు.