News March 26, 2025
ఆదిలాబాద్: CCI సాధన కమిటీ కార్యాచరణ ఇదే.!

ఆదిలాబాద్ సీసీఐ సాధన కమిటీ సమావేశాన్ని మంగళవారం సుందరయ్య భవనంలో నిర్వహించారు. మాజీ మంత్రి జోగురామన్న, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మార్చి 28న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 1న ఛలో ఢిల్లీ, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనున్నామని, ఉద్యమ ఫొటో, ఫ్లెక్సీలు పెట్టాలని సూచించారు. రోజూ సాయంత్రం 4 గంటలకు సీసీఐ సాధన పోరాట కమిటీ సమావేశం నిర్వహించాలని తీర్మానించామన్నారు.
Similar News
News March 31, 2025
ఆదిలాబాద్: 13వ రోజుకు చేరుకున్న దీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు పలు యువజన నాయకులు, వివిధ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.
News March 31, 2025
ADB: గ్రూప్-1లో అమరేందర్కు 149 ర్యాంకు

గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ప్రతిభ కనబరిచారు. స్థానిక దోబీ కాలనీకి చెందిన బండి అశోక్- లక్ష్మి దంపతుల కుమారుడు బండి అమరేందర్ 478.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 149 ర్యాంకు సాధించారు. మల్టీ జోన్- 1లో 76వ ర్యాంకు సాధించారు. గ్రూప్-1లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 31, 2025
ఆదిలాబాద్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్ను తేల్చనుంది. ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.