News March 26, 2025

HYD: గ్రేట్.. చనిపోతూ ఏడుగురిని కాపాడాడు!

image

తాను చనిపోతూ ఏడుగురికి ప్రాణం పోశాడు ఓ యువకుడు. ఎల్బీనగర్‌లో నివాసం ఉండే శ్రీ అశ్లేశ్ గురునానక్ కాలేజీ‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. మైగ్రేన్, ఫిట్స్‌తో మార్చి 21 అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించగా మార్చి 23న అతడి బ్రెయిన్ డెడ్ అయ్యింది. తల్లిదండ్రులు శివశంకర్, ప్రమీల రాణి కుమారుడి అవయవదానానికి ఒప్పుకున్నారు. దీంతో జీవన్‌దాన్ ద్వారా ఏడుగురి ప్రాణాలు కాపాడారు.

Similar News

News November 5, 2025

గోదావరిఖని: పీజీ కళాశాల విద్యార్థులకు బంగారు పతకాలు

image

గోదావరిఖని ప్రభుత్వ పీజీ కళాశాల ఎంబీఏ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి బంగారు పతకాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో విద్యార్థినులు దూడెం తరుణ, మునిగంటి మౌనిక, దేవులపల్లి ఉషశ్రీ, పున్నం కళ్యాణి, కందూరి కళ్యాణి, చిట్టవేణి సాగరిక ఉన్నారు. ఈనెల 7న శాతవాహన యూనివర్సిటీ నిర్వహించే ద్వితీయ స్నాతకోత్సవ వేడుకల్లో వీరు బంగారు పతకాలను అందుకోనున్నారు.

News November 5, 2025

ANU దూరవిద్య యూజీ, పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జూలై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. బిబిఎం, బిహెచ్ఎం, బిబిఏ, ఇయర్ ఎండ్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలతో పాటు, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ సోషల్ వర్క్, మొదటి, ద్వితీయ, తృతీయ సెమిస్టర్, తదితర ఫలితాలను విడుదల చేశారు.

News November 5, 2025

పాలకుర్తి: ‘6 గ్యారంటీలు, 420 హామీలతో కాలయాపన’

image

రెండేళ్లుగా 6 గ్యారంటీలు, 420 హామీలతో గద్దెనెక్కి గొప్పలు చెప్పుకుంటూ ఇప్పటివరకు చేసింది ఏమీలేదని BRS పార్టీ పాలకుర్తి మండల అధికార ప్రతినిధి ములుకాల కొమురయ్య ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన రోడ్లను ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమ్మక్క సారలమ్మ గుడికి MLA రూ.50 లక్షలు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదన్నారు.